బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్ ఇందర్‌సింగ్ సురుచి స్వర్ణంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 18 ఏండ్ల సురుచి.. 244.6 పాయింట్లు స్కోరు చేసి పసిడిని గెలుచుకుంది. క్వాలిఫికేషన్లో 583.16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆమె.. ఫైనల్లోనూ అదరగొట్టింది.
ప్రిక్వార్టర్స్‌కు ధ్రువ్-క్రాస్టో జోడీ
నింగ్బొ (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో తొలి రోజు భారత మిక్స్డ్ డబుల్స్ షట్లర్లు అదరగొట్టారు. మంగళవారం జరిగిన పోటీలలో భాగంగా భారత ద్వయం ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో.. 15-21, 21-11, 21-11తో హో పంగ్-సు యిన్ చెంగ్‌ను చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మరో పోరులో అమృత-అషిత్ జోడీ.. 21-9, 21-11తో తులిత్-పాంచాలి (శ్రీలంక)ను ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.