హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌత్ కరోలినా(అమెరికా) వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీఏ టూర్ డబ్ల్యూ75 టోర్నీలో భారత యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక భమడిపాటి శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో రష్మిక 3-6, 6-3, 6-3తో టాప్‌సీడ్ హన్నా చాంగ్‌పై అద్భుత విజయం సాధించింది.
తొలి సెట్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న రష్మిక అద్భుతంగా పుంజుకుని వరుస సెట్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అదే జోరుతో మహిళల డబుల్స్‌లో అమెరికా భాగస్వామితో కలిసి రష్మిక క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.