స్టావెంజర్(నార్వే): నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ సత్తాచాటాడు. శుక్రవారం జరిగిన ఓపెన్ రౌండ్-4 హోరాహోరీ పోరులో గుకేశ్..అమెరికా జీఎం ఫాబియానో కరువనపై అద్భుత విజయం సాధించాడు. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ఆర్మాగెడాన్ పద్ధతిలో గుకేశ్ విజయం సాధించాడు. గేమ్‌లో ఎక్కువ శాతం ఫాబియానో ఆధిపత్యం ప్రదర్శించినా విజయం సాధించడంలో విఫలమయ్యాడు. మరోవైపు ఇరిగేసి అర్జున్..నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. మహిళల విభాగంలో కోనేరు హంపి..వెన్జున్ చేతిలో ఓడగా, వైశాలి..అన్నా ముజుచుక్ను ఓడించి ముందంజ వేసింది.