IPL 2023 | ఐపీఎల్లో యశస్వీ సంచలనం.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన రాజస్థాన్ ఓపెనర్
IPL 2023: పదహారో సీజన్ ఐపీఎల్లో సెంచరీ కొట్టిన యశస్వీ జైస్వాల్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఈ రాజస్థాన్ ఓపెనర్ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 13 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
IPL 2023: పదహారో సీజన్ ఐపీఎల్లో సెంచరీ కొట్టిన యశస్వీ జైస్వాల్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఈ రాజస్థాన్ ఓపెనర్ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 13 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ రికార్డును బద్ధలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు.
Fastest FIFTY in the IPL
Yashasvi Jaiswal brings up his half-century in just 13 deliveries 👏👏#TATAIPL #KKRvRR pic.twitter.com/KXGhtAP2iy
— IndianPremierLeague (@IPL) May 11, 2023
తొలి ఓవర్ నుంచే..
ఐపీఎల్ 16వ సీజన్ 56వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అతను ఈ ఫీట్ సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో యశస్వీ తొలి ఓవర్లోనే రెచ్చిపోయాడు. నితీశ్ రానా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే దంచాడు. వరుసగా 6,6,4,4,0,4 బాదాడు. దాంతో, 26 రన్స్ వచ్చాయి. హర్షిత్ రానా వేసిన రెండో ఓవర్లోనూ జోరు కొనసాగించాడు. ఫోర్, సిక్స్ బాదాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 3వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన యశస్వీ సింగిల్ తీసి యాభై రన్స్ సాధించాడు.
6 6 4 4 2 4 ! @ybj_19 starts his innings in style.
Live – https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/HMuIPXbpIm
— IndianPremierLeague (@IPL) May 11, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

