Ravi Kumar Dahiya: పట్టు పట్టి సాధించాడు.. రెజ్లర్ల ఇలాఖా నుంచి వచ్చి మెడల్ పట్టాడు
ఒలింపిక్స్‌కు ఇండియా వెళ్లినప్పుడు అతని పేరు పెద్దగా వినిపించలేదు. పక్కాగా మెడల్ తీసుకొస్తాడన్న లిస్ట్‌లో రవికుమార్ దహియా ( Ravi Kumar Dahiya ) పేరు లేనే లేదు. కానీ అతడు ఎవరూ ఊహించని సంచలన విజయాన్ని సాధించాడు.

టోక్యో: ఒలింపిక్స్‌కు ఇండియా వెళ్లినప్పుడు అతని పేరు పెద్దగా వినిపించలేదు. పక్కాగా మెడల్ తీసుకొస్తాడన్న లిస్ట్‌లో రవికుమార్ దహియా ( Ravi Kumar Dahiya ) పేరు లేనే లేదు. కానీ అతడు ఎవరూ ఊహించని సంచలన విజయాన్ని సాధించాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్ చేరి దేశానికి కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేశాడు.
సుశీల్, యోగేశ్వర్ రూట్లోనే..
నేను శిక్షణ తీసుకుంటున్న సెంటర్ నుంచి ఒలింపిక్ మెడలిస్టులు ఉన్నారు.. వాళ్లతో పోలిస్తే నేనేం చేశాను.. ఇదీ రెండేళ్ల కిందట వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన తర్వాత రవికుమార్ దహియా చేసిన కామెంట్స్. గతంలో ఒలింపిక్స్‌లో మెడల్స్ గెలిచిన సుశీల్‌కుమార్, యోగేశ్వర్‌దత్‌లు శిక్షణ పొందిన ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలోనే రవికుమార్ శిక్షణ పొందాడు. వాళ్లను ఉద్దేశించే అతడు ఈ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత వాళ్ల సరసనే నిలిచాడు. వాళ్లకు సమానంగా ఏంటి.. ఫైనల్లో గెలిచి గోల్డ్ సాధిస్తే.. ఆ ఇద్దరినీ మించినవాడవుతాడు ఈ 22 ఏళ్ల యువ రెజ్లర్.
రెజ్లర్ల ఇలాఖా నుంచి వచ్చి..
రవికుమార్ దహియా సొంతూరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న నాహ్రి. దేశంలోని టాప్ రెజ్లర్లయిన యోగేశ్వర్ దత్, ఫోగాట్ అక్కచెళ్లెల్లు, భజరంగ్ పూనియాలాంటి వాళ్లదీ ఈ హర్యానానే. అక్కడి గడ్డపై పుట్టినవాళ్లకు స్వతహాగా రెజ్లింగ్‌పై మోజు పుడుతుందేమో. రవికుమార్ కూడా 10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు చూశాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సుశీల్‌కుమార్ కోచ్ సత్పాల్ సింగ్ దగ్గరే రెజ్లింగ్ ఓనమాలు నేర్చుకున్నాడు.
ఢిల్లీలోని ఛత్రసాల్‌లో శిక్షణ పొందే రెజ్లర్లలో 20 శాతం మంది రవికుమార్ దహియా ఊరి వాళ్లే ఉన్నారంటే అక్కడి వాళ్లకు రెజ్లింగ్‌పై ఎంత మమకారమో అర్థం చేసుకోవచ్చు. నిజానికి రవి దహియా రెజ్లింగ్‌లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా అతడే పట్టుపట్టి రెజ్లింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
తండ్రి కష్టం తెలిసినవాడు..
ఇండియాలోని చాలా మంది మట్టిలో మాణిక్యాలు ఓ నిరుపేద లేదంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. రవికుమార్ దహియా పరిస్థితీ అదే. వారిది వ్యవసాయ కుటుంబం. సొంతంగా భూమి లేక కౌలు రైతుగా మారాడు రవికుమార్ తండ్రి రాకేశ్ దహియా. అయినా తన కొడుకు కోరికను కాదనలేక అతనికి రెజ్లింగ్ నేర్పించాడు. ప్రతి రోజూ రవికి పాలు, పండ్లు ఇవ్వడానికి రాకేశ్ దహియా 40 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఇలా ఒకటీ రెండూ కాదు పదేళ్ల పాటు చేయడం విశేషం. తన కొడుకు ఇప్పుడీ స్థాయికి చేరినా.. రాకేశ్ దహియా మాత్రం ఇప్పటి వరకూ ఎప్పుడూ రవి ఆడుతుంటే చూడలేదట. రేయింబవళ్లు వ్యవసాయంలోనే చెమటోడ్చే ఆ తండ్రికి అంత సమయం లేదు మరి.
రవి దహియా జర్నీ ఇదీ
2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం ద్వారా రవికుమార్ దహియా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతకుముందు 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ అతడు సిల్వర్ మెడల్ గెలిచాడు. 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ గెలిచి తన రాకను బలంగా చాటాడు. 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి సీనియర్ స్థాయిలో మెడల్ గెలిచాడు. అప్పటి నుంచీ 57 కేజీల కేటగిరీలో నిలకడగా రాణిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

