WPL 2024, UP vs RCB | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ బెంగళూరు వేదికగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వీరవిహారం చేసింది. 33 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన పెర్రీ.. ‘గ్లాస్ బ్రేకింగ్ ఇన్నింగ్స్’ ఆడింది అంటున్నారు చిన్నస్వామి స్టేడియంలో ఆమె ఆట చూసినవాళ్లంతా.. అదేంటి..? అదేం పొగడ్త అనుకుంటున్నారా..? ఆమె ఇన్నింగ్స్ అలా సాగింది మరి.. ‘కోడ్తే కారు అద్దాలు పగిలిపోయేంత’ దూకుడుగా ఆమె ఆడింది.
యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ సబ్బినేని మేఘన ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన పెర్రీ.. ఆరంభంలో నెమ్మదిగానే ఆడింది. మొదటి 20 బంతుల్లో 20 రన్స్ చేసిన ఆమె తర్వాత ఇన్నింగ్స్ జోరు పెంచింది. 18వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదిన ఆమె.. దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్లో మూడో బంతిని ఫోర్‌గా మలిచి హాఫ్ సెంచరీ సాధించింది. ఇదే ఓవర్లో ఔదో బంతికి ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని ముందకొచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా ఆడింది.
What A Shot By Ellyse Perry
Queen Perry Broken The Glass Of Car ❤️💀💯 pic.twitter.com/zMBEajXXTg
— ℂ𝕙𝕖𝕖𝕜𝕦𝕟𝕒𝕥𝕚𝕠𝕟🚩 (@82_mcgclassic) March 4, 2024
పెర్రీ బంతిని బాదిన వేగానికి అది కాస్తా ల్యాండ్ అయ్యే క్రమంలో అక్కడే ఉన్న కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు ఇచ్చేది) అద్దాలకు తాకింది. దీంతో ఆ అద్దాలు అక్కడికక్కడే ముక్కలైపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోతో పాటు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన అభిమానులంతా పెర్రీ ‘గ్లాస్ బ్రేకింగ్ ఇన్నింగ్స్’ ఆడిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న పెర్రీకి ఇదే తొలి ఫిఫ్టీ.. ముంబైతో మ్యాచ్‌లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఆమె.. బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంటోంది.
Ellyse Perry 😠 pic.twitter.com/K9k8sDqObc
— ಭಲೇ ಬಸವ (@Basavachethanah) March 4, 2024
ఇదిలాఉండగా.. యూపీతో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. స్మృతి మంధాన (80), పెర్రీ (58)లు అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు.