WPL 2023 | తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం.. 143 పరుగుల తేడాతో గుజరాత్ చిత్తు
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 64కే ఆలౌట్ అయింది.
WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 64కే ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దాంతో గుజరాత్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. వచ్చిన వాళ్లు వచ్చినట్టూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ జట్టులో దయలాన్ హేమలత టాప్ స్కోరర్. హేమలత, మన్సీ జోషి (6) ఎనిమిదో వికెట్‌కు 26 రన్స్ జోడించారు. ముంబై బౌలరల్లో సాయిక ఇషక్ నాలుగు, అమేలియా, నాట్ సీవర్ బ్రంట్ తలా రెండు వికెట్లు తీశారు. ఇసీ వాంగ్‌కు ఒక వికెట్ దక్కింది.
తొలి ఓవర్లోనే షాక్..
తొలి ఓవర్లోనే గుజరాత్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన బేత్ మూనీ మొదటి ఓవర్లోనే కెప్టెన్ మూనీ రిటౌర్డ్ హర్ట్‌గా మైదానం వీడింది. ఆఖరి బంతికి డియోల్ హర్లిన్ ఔట్ అయింది. ఆ తర్వాత ఆ జట్టు 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జార్జియా వరేహమ్ (8), స్నేహ్ రానా (1), అషే గార్డ్నర్ (0), తనుజా కన్వార్ (0) విఫలం అయ్యారు.
లీగ్‌లో తొలి ఫిఫ్టీ
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ (65)తో చెలరేగింది. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది. ఈ లీగ్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. 22 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరువైంది. గ్యాప్స్‌లో బౌండరీలు కొడుతూ గుజరాత్ జెయింట్స్ బౌలర్లపై విరుచుకు పడింది. అమేలియాతో కలిసి హర్మన్‌ప్రీత్ నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించింది.
15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ముంబైని నాట్ హేలీ మ్యాథ్యూస్ (47) , నాట్ సీవర్ బ్రంట్ (23) ఆదుకున్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 54 రన్స్ చేశారు. అమేలియా కేర్ (45), పూజా వస్త్రాకర్ (15) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రానా రెండు, తనూజ కన్వర్, జార్జియా వారేహమ్, అషే గార్డ్నర్ తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
Bharat Summit | కార్మికుల నెత్తురుతో.. సమ్మిట్ సోకులు.. భారత్ సమ్మిట్‌కు ఖర్చు చేసే సొమ్ములో మేజర్ వాటా కార్మిక సంక్షేమ బోర్డుదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

