ఢిల్లీ: వరల్డ్ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ సంచలనం అనాహత్ సింగ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 19 ఏండ్ల ఈ ఢిల్లీ అమ్మాయి.. 3-1 (11-7, 11-5, 6-11, 11-9)తో హబీబా రిజ్క్ (ఈజిప్ట్)ను చిత్తుచేసింది. ఈ టోర్నీ నిరుటి ఎడిషన్‌లో కాంస్యం నెగ్గిన అనాహత్.. ఈసారి పతకం రంగు మార్చాలనే పట్టుదలతో ఉంది.