World Cup Trophy | విజేతకు అందించే వరల్డ్‌కప్ ట్రోఫీ అసలైనదేనా?
World Cup Trophy : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగేండ్లకోసారి ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్(ODI World Cup)ను నిర్వహిస్తుంటుంది. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ(World Cup Trophy)ని బహుకరిస్తుంది. ఈ ట్రోఫీ దాదాపు 11 కిలోల బరువు, 60 సెంటీమీటర్ల...
World Cup Trophy : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగేండ్లకోసారి ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్(ODI World Cup)ను నిర్వహిస్తుంటుంది. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ(World Cup Trophy)ని బహుకరిస్తుంది. ఈ ట్రోఫీ దాదాపు 11 కిలోల బరువు, 60 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని బంగారం, వెండితో తయారు చేస్తారు. అయితే.. ప్రతిసారి ప్రపంచకప్ విజేత కోసం బంగారం, వెండితో ట్రోఫీని తయారు చేస్తారా? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది. కానీ, అలా చేయరు.
ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌కు అందిస్తున్న ట్రోఫీని 1999లో రూపొందించారు. ఇక అప్పటి నుంచి 2003, 07, 11, 15, 19 విజేతలకు ఇదే ట్రోఫీని బహుకరించారు. అయితే.. బహుమతి ప్రదాన సమయంలో మాత్రమే ఒరిజినల్ ట్రోఫీని విజేత చేతికి అందిస్తారు. ఆ తర్వాత దాన్ని తిరిగి దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. అనంతరం వరల్డ్ కప్ నమూనా ట్రోఫీని విజేతగా నిలిచిన జట్టుకు అందిస్తారు. వికెట్ల రూపంలో ఉన్న మూడు పిల్లర్ల మధ్య బంతిని పోలి ఉండే విశ్వం నమూనాతో ఉన్న ట్రోఫీని గత ఆరు పర్యాయాలు అందించారు.

తొలిసారి 1975లో వన్డే ప్రపంచకప్ నిర్వహించారు. తొలి మూడు ఎడిషన్లలో ప్రూడెన్షియల్ కప్ ట్రోఫీ (Prudential Cup Trophy)అని పిలిచేవారు. ఆ తర్వాత 1987 ప్రపంచకప్ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వగా.. రియలన్స్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. దీంతో ప్రూడెన్షియల్ కప్ కాస్తా.. రిలయన్స్ ట్రోఫీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 1992లో ‘బెన్సన్, హెడ్జెస్ ట్రోఫీ, 1996లో ‘విల్స్ కప్ ట్రోఫీ’గా దీన్ని పిలిచారు. 1999 నుంచి స్పాన్సర్ల పేర్ల మీద కాకుండా కేవలం ప్రపంచకప్ అని అభివర్ణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
-
Harish Rao | గురుకులాల నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తయారయ్యారు: మంత్రి హరీశ్‌రావు
-
Amazon | ప్రమోషన్ కావాలంటే కార్యాలయం నుంచి పనిచేయాల్సిందే : ఉద్యోగులకు అమెజాన్ వార్నింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

