Amazon | ప్రమోషన్ కావాలంటే కార్యాలయం నుంచి పనిచేయాల్సిందే : ఉద్యోగులకు అమెజాన్ వార్నింగ్
పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు అమెజాన్ (Amazon) గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రమోషన్స్ కావాలంటే కార్యాలయాల నుంచి పనిచేసే నిబంధనను ఉద్యోగులు అనుసరించాలని ఈ-కామర్స్ దిగ్గజం స్పష్టం చేసింది.
న్యూయార్క్ : పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు అమెజాన్ (Amazon) గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రమోషన్స్ కావాలంటే కార్యాలయాల నుంచి పనిచేసే నిబంధనను ఉద్యోగులు అనుసరించాలని ఈ-కామర్స్ దిగ్గజం స్పష్టం చేసింది. వారానికి కనీసం మూడు రోజుల పాటు ఆఫీస్‌ల నుంచి పనిచేయని ఉద్యోగులు ప్రమోషన్ ఛాన్స్ మిస్ అవుతారని హెచ్చరించింది. ఉద్యోగులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సవాళ్లతో కూడిన అసైన్‌మెంట్స్‌ను ఉద్యోగులు చేపట్టేలా ప్రోత్సహించే మేనేజర్ల పాత్ర ప్రమోషన్ ప్రక్రియలో కీలకమవుతుందని పేర్కొంది.
నూతన విధాన అమలును అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ ధ్రువీకరిస్తూ ఉద్యోగుల వృద్ధికి ఊతమిచ్చేందుకు కంపెనీ కట్టుబడిఉందని, అందులో ప్రమోషన్లు భాగమేనని చెప్పారు. ప్రమోషన్ సంబంధిత నిర్ణయాల్లో కంపెనీ మార్గదర్శకాలు, విధానాలకు అనుగుణంగా పనిచేయడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ ఏడాది మేలో ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయడం అనివార్యమని కంపెనీ పేర్కొనడంతో అమెజాన్ నిర్ణయం పట్ల పెద్దసంఖ్యలో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల నుంచి విధిగా పనిచేయాలని ఈ-కామర్స్ దిగ్గజం నిర్ధేశించడంతో కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తాజాగా పదోన్నతులకూ నూతన నిబంధనలతో ముడిపెట్టడం పట్ల టెకీలు ఎలా రియాక్టవుతారనేది చూడాలి.
Read More :
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

