భారత సంపన్నుల కన్నా ధనిక దేశాల పేదల ఆదాయమే మిన్న
ప్రపంచంలోని కొన్ని సంపన్న దేశాల్లో అత్యంత పేదరికంలో నివసిస్తున్న 10 శాతం ప్రజల జీవన ప్రమాణాలు.. భారత్‌లోని అత్యంత సంపన్నులైన 10 శాతం మంది కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ‘2026 పేదరికం, అసమానతల నివేదిక’ పేర్కొన్నది.
- ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక
వాషింగ్టన్, అక్టోబర్ 12 : ప్రపంచంలోని కొన్ని సంపన్న దేశాల్లో అత్యంత పేదరికంలో నివసిస్తున్న 10 శాతం ప్రజల జీవన ప్రమాణాలు.. భారత్‌లోని అత్యంత సంపన్నులైన 10 శాతం మంది కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ‘2026 పేదరికం, అసమానతల నివేదిక’ పేర్కొన్నది. అమెరికాలోని నిరుపేదల ఆదాయం లేదా వినియోగం రోజుకు 25 డాలర్లు (దాదాపు రూ.2,500)గా ఉన్నదని, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది 28 డాలర్లుగా, కెనడాలో 31 డాలర్లుగా ఉన్నదని చెప్పింది. ఇదే సమయంలో భారత్‌లోని అత్యంత శ్రీమంతుల్లో 10 శాతం మంది రోజువారీ ఆదాయం, వినియోగం పరిమితి ఒక్కో వ్యక్తికి దాదాపు 10 డాలర్లు (సుమారు రూ.1,000)గానే ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది.
అలాగే భారత్‌లో కటిక దారిద్య్రంలో నివసిస్తున్న 10 శాతం మంది రోజువారీ ఆదాయం, వినియోగం 3 డాలర్లు (ఇంచుమించు రూ.300)గా ఉన్నట్టు తేలింది. కాగా, అమెరికాలో అత్యంత శ్రీమంతుల్లో 10 శాతం మంది రోజువారీ ఆదాయం, వినియోగం అత్యధికంగా 173 డాలర్లుగా ఉన్నది. కెనడా, ఆస్ట్రేలియాల్లో ఇది 129 డాలర్లుగా, జర్మనీలో 128 డాలర్లుగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ తమ నివేదికలో పేర్కొన్నది. కాగా, దీనిపై ఆర్థికాభివృద్ధి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అసోసియేట్ అహోనా దత్తగుప్తా స్పందిస్తూ.. మరిన్ని సంస్కరణలు భారత్‌కు అవసరమని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

