Worldcup | ఇంగ్లండ్‌పై ఆసీస్ మహిళల ఉత్కంఠ విజయం..
మహిళల ప్రపంచకప్‌లో ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అమ్మాయిలు విజయఢంకా మోగించారు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియన్లు 310/3 స్కోరు చేశారు. ఆసీస్ ఓపెనర్ రచేల్ హనేస్ 130 పరుగులతో విజృంభించగా.. మరో ఓపెనర్ అలిస్సా హేలీ (28) ఫర్వాలేదనిపించింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ (86) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో బెత్ మూనీ (27), ఎలీస్ పెర్రీ (14) మెరుపులు మెరిపించారు. దీంతో మూడు వికెట్లు కోల్పోయిన జట్టు 310 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్ (0) డకౌట్‌గా వెనుతిరిగింది. అయితే మరో ఓపెనర్ టామీ బ్యూమౌంట్ (74), కెప్టెన్ హెతర్ నైట్ (40) రాణించారు.
ఆ తర్వాత వచ్చిన నాట్ సివర్ (109 నాటౌట్) అజేయంగా నిలిచింది. కానీ ఆమెకు అవతలి ఎండ్ నుంచి సహకారం కరువైంది. అమీ జోన్స్ (4), డానీ వ్యాట్ (7), సోఫీ ఎకిల్‌స్టోన్ (1) నిరాశపరిచారు. సోఫియా డంక్లీ (28), కేథరీన్ బ్రంట్ (25) పరుగులు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు 298/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. దాంతో ఆసీస్ మహిళలు 12 పరుగులతో జయభేరి మోగించారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రచెల్ హేనేస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

