WPL 2023 | డబ్ల్యూపీఎల్ తొలి సీజన్.. రికార్డులు సృష్టించిన ప్లేయర్స్ వీళ్లే
బీసీసీఐ (BCCI) తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో ఐపీఎల్‌కు ఏమాత్రం తగ్గకుండా విధ్వంసక ఇన్నింగ్స్‌లు, స్టన్నింగ్ క్యాచ్‌లతో మహిళా క్రికెటర్లు వారెవ్వా అనిపించారు. కొందరు తమ బ్యాటింగ్ విన్యాసాలతో తమ ముద్ర వేశారు. మరి కొందరు బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వాళ్లు ఎవరంటే..?
WPL 2023 : మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయంగా పేరొందిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఆద్యంతం ఫ్యాన్స్‌ను అలరించింది. బీసీసీఐ తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) చాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠ పోరాటాలు, సంచలన విజయాలతో ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) టేబుల్ టాపర్‌గా నిలిచాయి. అయితే.. ఐపీఎల్‌కు ఏమాత్రం తగ్గకుండా విధ్వంసక ఇన్నింగ్స్‌లు, స్టన్నింగ్ క్యాచ్‌లతో మహిళా క్రికెటర్లు వారెవ్వా అనిపించారు. కొందరు తమ బ్యాటింగ్ విన్యాసాలతో తమ ముద్ర వేశారు. మరి కొందరు బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. డబ్ల్యూపీఎల్‌లో రికార్డులు సృష్టించిన ప్లేయర్స్ ఎవరంటే..?
తొలి హ్యాట్రిక్ : ముంబై ఇండియన్స బౌలర్ ఇసీ వాంగ్ (Issy Wong) ఈ లీగ్‌లో మొదటి హ్యాట్రిక్ నమోదు చేసింది. అది కూడా కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో కిరణ్ నవగిరే, సిమ్రాన్ షేక్, సోఫీ ఎకిల్‌స్టోన్‌ను ఔట్ చేసింది. దాంతో, డబ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఆమె మూడో వికెట్ తీయగానే స్టేడియం మొత్తం వాంగ్.. వాంగ్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఫైనల్లోనూ ఆమె ఒకే ఓవర్లో లో ఫుల్ టాస్ బంతులతోషఫాలీ వర్మ, అలిసే క్యాప్సేలను ఔట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టింది.
ఆరెంజ్ క్యాప్ : ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరడం వెనక ఆ జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ (Meg Lannig) తెలివైన బుర్ర ఉంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటిన ఆమె ఆరెంజ్ క్యాప్ అందుకుంది. ఈ టోర్నీలో ఆమె అత్యధికంగా 345 పరుగులు చేసింది. ఆమె ఖాతాలో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. షఫాలీ వర్మతో కలిసి ఢిల్లీకి శుభారంభాలు ఇచ్చింది. ముంబైతో ఫైనల్ పోరులో కీలక వికెట్లు పడినా లానింగ్ ఒంటరి పోరాటం చేసింది.
అత్యధిక స్ట్రైక్ రేటు : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) ఈ లీగ్‌లో తన బ్యాట్ పవర్ చూపించింది. ఈ డాషింగ్ ఓపెనర్ 185.29 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై చెలరేగి ఆడి హాఫ్ సెంచరీ కొట్టింది. ఆ తర్వాతి మ్యాచుల్లోనూ క్రీజులో ఉన్నంత సేపు ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించింది. అంతేకాదు అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ సోఫీ డెవినె, షఫాలీ తలా 16 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నారు
అత్యధిక వికెట్లు : ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్(Hayley Matthews), యూపీ వారియర్స్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ ఈ టోర్నీలో ఎక్కువ వికెట్లు తీశారు. వీళ్లిద్దరూ 16 వికెట్లతో టాప్ వికెట్ టేకర్స్‌గా నిలిచారు. ఫైనల్లో మాథ్యూస్ మూడు వికెట్లతో ఢిల్లీని దెబ్బ కొట్టింది.
అత్యధిక స్కోర్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ సోఫీ డెవినె (Devine) అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించింది. గుజరాత్ జెయింట్స్‌పై చెలరేగిన ఆమె 36 బంతుల్లోనే 99 రన్స్ చేసింది. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. సునామీలా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడిన ఆమె ఇన్నింగ్స్‌లో 9 బౌండరీలు, 8 సిక్స్‌లు ఉన్నాయి.
అత్యధిక సగటు: ముంబై ఇండియన్స్ ప్లేయర్ నాట్ స్కీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) అత్యధిక సగటుతో బ్యాటింగ్ చేసింది. ఆమె 66.4 సగటుతో పరుగులు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ముంబైని పలు మ్యాచుల్లో గెలిపించింది. ముఖ్యంగా ఎలిమినేటర్, ఫైనల్లో అర్ధ శతకాలతో చెలరేగి జట్టును విజయ తీరాలకు చేర్చింది.
అత్యుత్తమ గణాంకాలు: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మరినే కాప్ (Marizanne Kapp) డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలతో రికార్డు క్రియేట్ చేసింది. గుజరాత్ జెయింట్స్‌పై ఆమె 5 వికెట్లతో చెలరేగింది. కేవలం 15 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కూల్చింది.
ఇవి కూడా చదవండి
Marnus Labuschagne | ఈ ఆస్ట్రేలియన్ స్టార్ మెచ్చిన భారతీయ వంటకం.. ఐపీఎల్ టీమ్ ఏదంటే..?
IPL 2023 | రాజస్థాన్ బౌలింగ్ దళంలో స్టార్ పేసర్.. ప్రసిధ్ స్థానంలో జట్టులోకి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

