లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఇగా స్వియాటెక్ (పోలండ్), అమెరికా అమ్మాయి అమాండ అనిసిమొవ (అమెరికా) ఫైనల్ చేరారు. టైటిల్ వేటలో నిలిచిన టాప్ సీడ్ అరీనా సబలెంకాకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో కోకో గాఫ్ చేతిలో ఓడిన ఆమెకు.. తాజాగా వింబుల్డన్ సెమీస్‌లోనూ నిరాశ తప్పలేదు.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సబలెంకా.. 4-6, 6-4, 4-6తోఅమాండ చేతిలో చిత్తైంది. రెండో సెమీస్‌లో స్వియాటెక్.. 6-2, 6-0తో బెలింద బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్ చేరింది. తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన స్వియాటెక్, అమాండ. శనివారం టైటిల్ పోరులో తలపడనున్నారు.