సిన్సినాటి (యూఎస్): వింబుల్డన్ విజేత యానిక్ సిన్నర్ (ఇటలీ) సిన్సినాటి ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ టోర్నీ బరిలో నిలిచిన ప్రపంచ ఒకటో ర్యాంకర్ సిన్నర్.. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో 6-0, 6-2తో అగర్ అలిఅస్సిమ్ (కెనడా)పై అలవోక విజయం సాధించాడు. 71 నిమిషాల పాటు సాగిన పోరులో సిన్నర్ జోరు ముందు కెనడా ఆటగాడు నిలువలేకపోయాడు. హార్డ్ కోర్ట్‌లో సిన్నర్‌కు ఇది వరుసగా 25వ గెలుపు.
ఎఫ్‌సీ గోవాX అల్ నాసర్
దుబాయ్: ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్‌లో ఆసక్తికర పోరు జరుగనుంది. ఐఎస్ఎల్ టీమ్ ఎఫ్‌సీ గోవా…దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్తో ఎఫ్‌సీ గోవా తలపడనుంది. తొలుత అక్టోబర్ 22న భారత్‌లో ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. దీంతో భారత్‌కు రొనాల్డో రాక దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. మలిపోరు నవంబర్5న జరుగనుంది.