Aryna Sabalenka | బెలారస్‌కు చెందిన వరల్డ్ నెంబర్-2 సీడ్ వింబుల్డన్‌లో సెమీ ఫైనల్‌కు చేరింది. అమెరికాకు చెందిన మాడిసన్ కీస్పై 6-2, 6-4 పాయింట్లతో విజయం సాధించింది. సైమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కజకిస్తాన్‌కు చెందిన ఎలెనా రైబాకినా లేదంటే.. ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్‌తో శనివారం జరిగే ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నది. అయితే, రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2022లో టోర్నీ నుంచి బెలారసియన్ ఆటగాళ్లతో పాటు సబలెంకాను టోర్నీ నుంచి నిషేధించారు. బెలారస్ మాస్కోకు మిత్రదేశం కావడం ఇందుకు కారణంగా. ఈ ఏడాది జరుగుతున్న వింబుల్డన్‌లో సెమీ ఫైనల్‌కు చేరడంపై సబలెంకా హర్షం వ్యక్తం చేసింది. గతంలో కంటే ఈ సారి మెరుగ్గా రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. తాను చిన్ననాటి నుంచి వింబుల్డన్ గెలవాలని కలలుగన్నానని, ఇది ప్రత్యేకమైందని పేర్కొంది.