Jai Shah | జై షా వారసుడిగా రోహన్ జైట్లీ?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్ రేసులోకి వెళ్లనుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం బోర్డు వేట మొదలుపెట్టిందా? ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు, బీజేపీ దివంగత నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు అయిన రోహన్ జైట్లీ.. జై షా వారసుడిగా ఎంపిక కాబోతున్నాడా?
Jai Shah | ఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్ రేసులోకి వెళ్లనుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం బోర్డు వేట మొదలుపెట్టిందా? ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు, బీజేపీ దివంగత నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు అయిన రోహన్ జైట్లీ.. జై షా వారసుడిగా ఎంపిక కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సెక్రటరీ పదవికి రాష్ర్టాల అసోసియేషన్ల నుంచి పలువురి పేరు వినిపించినా జై షా తో పాటు బోర్డు రోహన్ వైపునకే మొగ్గుచూపుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఐసీసీ చైర్మన్ రేసులో ఉన్న జై షాకు బోర్డులో 16 మందికి గాను 15 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అతడు చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.
మహిళా క్రికెటర్లకు తీపి కబురు..
ముంబై: దేశంలో మహిళా క్రికెట్ అభ్యున్నతిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇక నుంచి దేశవాళీ క్రికెట్లో ఆడే మహిళలు, జూనియర్ స్థాయి పోటీలలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ విజేతలకు నగదు బహుమానం అందజేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

