ODI World Cup 2023 | ఆ మ్యాచ్‌లో ఆరు.. ఈ మ్యాచ్‌లో రెండు.. అసలేమైంది కంగారూలకు!
ODI World Cup 2023 | అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డింగ్‌కు పెట్టింది పేరైన ఆస్ట్రేలియా.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్ ఫీల్డింగ్ నాసిరకం అనే చొప్పుచ్చు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో కంగారూ ఫీల్డర్లు.. మరీ గల్లీ పోరగాళ్లను తలపించారు.
ODI World Cup 2023 | అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డింగ్‌కు పెట్టింది పేరైన ఆస్ట్రేలియా.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్ ఫీల్డింగ్ నాసిరకం అనే చొప్పుచ్చు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో కంగారూ ఫీల్డర్లు.. మరీ గల్లీ పోరగాళ్లను తలపించారు. వారి స్థాయికి సులువుగా పట్టాల్సిన క్యాచ్‌లను సైతం జార విడిచి అపవాదు మూట గట్టుకున్నారు. టోర్నీలో భాగంగా తమ తొలి పోరులో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సాధారణ జట్టులా కనిపించింది. ప్రపంచంలో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు వరల్డ్ కప్ చేజిక్కించుకున్న ఆసీస్.. శ్రీలంకతో పోరులోనూ మొదట్లో చెత్త ఫీల్డింగ్ చేసింది. రెండు అవకాశాలను జార విడిచింది. ఈ సమయంలో జట్టులో ఆత్మస్థైర్యం నింపుతూ వార్నర్ అద్భుత క్యాచ్ అందుకోగా.. ఇక అక్కడి నుంచి మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు సాధారణంగా కనిపించిన ఆసీస్ ఆ తర్వాత విజృంభించింది.
పోగొట్టుకున్నచోటే..
మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక ఒక దశలో 125/0తో పటిష్ట స్థితిలో నిలువగా.. బౌలర్లకు పెద్దగా సహకారం లభించకపోవడంతో లంకేయులు భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. అయితే ఈ దశలో కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతిని నిషాంక పుల్ చేసే ప్రయత్నం చేయగా.. డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇక మరికాసేపటికే లంక కెప్టెన్ కుషాల్ మెండిస్‌ను కూడా డేవిడ్ భాయ్ తన ఫీల్డింగ్ విన్యాసంతోనే పెవిలియన్ బాట పట్టించాడు. స్పిన్నర్ జాంపా బౌలింగ్ భారీ మెండిస్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి దాదాపు 20 అడుగుల దూరం పరిగెత్తుకుంటూ వచ్చిన వార్నర్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో నేలపై మూడు పల్టీలు కొట్టినా చేతిలో నుంచి బంతిని మాత్రం వదలలేదు. దీంతో జట్టులో కొత్త ఉత్సాహం రాగా.. కెప్టెన్ కమిన్స్ కూడా ఓ చక్కటి రనౌట్‌తో తన విలువ చాటుకున్నాడు. దీంతో పోగొట్టుకున్న చోటే తిరిగి పరువు నిలబెట్టుకున్నారని ఆస్ట్రేలియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

