శుక్రవారం 29 మే 2020
Sports - Apr 02, 2020 , 16:37:10

అదే అత్యుత్త‌మ క్ష‌ణం

అదే అత్యుత్త‌మ క్ష‌ణం

న్యూఢిల్లీ: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న కెప్టెన్సీలో టైటిల్ నెగ్గ‌డ‌మే ఐపీఎల్లో అత్యుత్త‌మ క్ష‌ణ‌మ‌ని ఆస్ట్రేలియా విధ్వంస‌క ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ పేర్కొన్నాడు. 2016లో వార్న‌ర్ కెప్టెన్సీలో హైద‌రాబాద్ జ‌ట్టు విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇత‌ర ఆట‌గాళ్ల నుంచి పెద్ద‌గా స‌హ‌కారం ల‌భించ‌కున్న వార్న‌ర్ పోరాటంతోనే ఫైన‌ల్ చేరిన స‌న్‌రైజ‌ర్స్‌.. ఫైన‌ల్లో కోహ్లీ సార‌థ్యంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి టైటిల్ సాధించింది. 

`నా అత్యుత్త‌మ ఐపీఎల్ మూమెంట్ ఇదే.  స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు నా భార‌త కుటుంబం` అని వార్న‌ర్ గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తెలిపాడు. హైద‌రాబాద్ జ‌ట్టు టైటిల్ అందుకుంటున్న ఫోటోను జ‌త‌చేశాడు. 2016 సీజ‌న్‌లో వార్న‌ర్‌ 48.00 స‌గ‌టుతో 848 ప‌రుగులు చేశాడు. అందులో తొమ్మిది అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఐపీఎల్ 13వ సీజ‌న్ నిర్వ‌హిస్తారా లేదా అనే అంశంపై స్ప‌ష్ట‌త కొర‌వ‌డ్డ త‌రుణంలో ఈ ఆసీస్ ఓపెన‌ర్ త‌న పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నాడు.


logo