David Warner | ఆ ప్రశ్న అడుగుతారని ఊహించా.. ‘బాల్ ట్యాంపరింగ్’పై వార్నర్ రియాక్షన్ ఇది
David Warner : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) కొత్త ఏడాది మొదటి రోజే క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. జనవరి 3న ఆఖరి టెస్టు ఆడనున్న డేవిడ్ భాయ్.. వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే.. మీడియా సమావేశంలో వార్నర్‌కు బాల్ ట్యాంపరింగ్ వివాదం(Ball Tampering Scandal) గురించిన ప్రశ్న...
David Warner : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) కొత్త ఏడాది మొదటి రోజే క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. జనవరి 3న ఆఖరి టెస్టు ఆడనున్న డేవిడ్ భాయ్.. వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఒకవేళ ఫిట్‌గా ఉంటే 2025లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి అందుబాటులో ఉంటానని తెలిపాడు.
అయితే.. సిడ్నీ గ్రౌండ్లో మీడియా సమావేశంలో వార్నర్‌కు బాల్ ట్యాంపరింగ్ వివాదం(Ball Tampering Scandal) గురించిన ప్రశ్న ఎదురైంది. ‘ఈ ప్రశ్న అడుగుతారని ముందే ఊహించా. అలాగనీ నా సుదీర్ఘ కెరీర్లో తప్పు చేశానని మాత్రం బాధ పడడం లేదు’ అని ఈ స్టార్ ఆటగాడు బదులిచ్చాడు. అంతేకాదు ఆ వివాదం దెబ్బతో తీవ్ర మనోవేదనకు గురైన సందర్భంలో భార్య క్యాండిసే(Candice), బంధువులు మద్దతుగా నిలిచారని తెలిపాడు.
ఆసలేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా జట్టు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ సమయంలో కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్(Cameron Bancraft) సాండ్‌పేపర్(Sand Paper)తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్ చేసి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన అతడిపై విచారణ జరపగా.. అందులో వార్నర్ హస్తం ఉందని తేలింది. దాంతో, ఆసీస్ ఆటగాళ్లపై మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
స్మిత్, వార్నర్, బ్యాండ్క్రాఫ్ట్

ఆ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నబాల్ ట్యాంపరింగ్‌తో సంబంధం ఉన్న వార్నర్, స్టీవ్ స్మిత్(Steven Smith), బ్యాండ్క్రాఫ్ట్పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. వార్నర్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేయడమే కాకుండా కెప్టెన్సీ చేపట్టకుండా ఆంక్షలు విధించింది.

ప్రపంచంలోని విధ్వంసక ఓపెనర్లలో ఒకడైన వార్నర్‌కు వన్డేల్లో మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ 161 వన్డేలు ఆడిన వార్నర్ 6,932 పరుగులు సాధించాడు. 97.26 స్ట్రైక్ రేటుతో 22 సెంచరీలు బాదాడు. దాంతో, ఆసీస్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) 29 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి
- Lionel Messi | మారడోనాకు దక్కని గౌరవం మెస్సీ సొంతం.. 10 నంబర్ జెర్సీపై అర్జెంటీనా కీలక నిర్ణయం
- Arvind Kejriwal | జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. పార్టీ కార్యకర్తలతో కేజ్రీవాల్
- Saindhav Movie | వెంకటేశ్ ‘సైంధవ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

