Virat Kohli | ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..! సచిన్ రికార్డును అధిగమించిన పరుగుల యంత్రం..!
Virat Kohli | టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్తి చేసి.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
Virat Kohli | టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్తి చేసి.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి.. ఈ మైలురాయిని అందుకున్నాడు. హారిస్ రవూఫ్ బోలింగ్లో ఫోర్ కొట్టిన విరాట్.. టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు.
సచిన్ టెండూల్కర్ 350 వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. విరాట్ 287 వన్డేల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో 14వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ రికార్డులకెక్కాడు. 463 వన్డేల్లో 44.8 సగటుత 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 404 వన్డేల్లో 42 సగటుతో 18,048 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ మొత్తం 299 మ్యాచుల్లో 57.8 సగటుతో 14వేల పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

