Virat Kohli: టీమిండియా జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీ
Virat Kohli: కోహ్లీ అయిదు రోజులు ఆలస్యంగా టీమిండియా జట్టుతో కలిశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు రోహిత్ సేన వారం ముందే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ మాత్రం శుక్రవారం అమెరికాకు చేరుకున్నాడు.
న్యూయార్క్: టీ20 వరల్డ్‌కప్ కోసం క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. అమెరికాలో ఉన్న టీమిండియా జట్టుతో జత కలిశాడు. టీమిండియా వెళ్లిన అయిదు రోజుల తర్వాత ఆ జట్టు బృందంతో కోహ్లీ కలిశాడు. అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరగనున్న వార్మప్ మ్యాచ్‌లో ఆడేది లేనిది డౌట్‌గానే ఉన్నది. టీమ్ హోటల్లోకి కోహ్లీ చెకిన్ అయ్యాడని, సుదీర్ఘ ఫ్లయిట్ జర్నీ తర్వాత అతను జట్టుతో కలిశాడని, ప్రస్తుతం అతను రెస్టు తీసుకుంటాడని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపాడు. 16 గంటల పాటు జర్నీ చేయడం వల్ల కోహ్లీ ప్రాక్టీసు మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు అన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాసౌ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో బంగ్లాతో ప్రాక్టీస్ మ్యాచ్ జరగనున్నది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కోహ్లీ 15 మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో అతను 741 రన్స్ చేశౄడు. ఇక జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో జరగనున్న ఫస్ట్ మ్యాచ్‌కు ముందే అతను మూడు నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ట్రైనింగ్ సెషన్లో రింకూ సింగ్, శివం దూబే, సిరాజ్‌లు పాల్గొన్నారు. సపోర్టు స్టాఫ్ సమక్షంలో శిక్షణ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

