Virat Kohli: కొన్‌స్టాస్‌ను భుజంతో ఢీకొట్టిన ఘటనలో.. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
Virat Kohli: కోహ్లీకి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అతనికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. మెల్బోర్న్ టెస్టులో అతను ఆసీస్ బ్యాటర్ కొన్‌స్టాస్‌ను భుజంతో ఢీకొట్టినట్లు కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకున్నది.
మెల్బోర్న్: మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్టులో.. యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్‌ను ..కోహ్లీ(Virat Kohli) భుజంతో ఢీకొట్టాడు. క్రీజ్‌పై ఎదురెదురుగా నడుస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఆ ఘటన పట్ల ఐసీసీ చర్యలు తీసుకున్నది. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పదవ ఓవర్లో ఈ ఘటన జరిగింది. పిచ్‌పై ఎదురెదురుగా వెళ్తున్న సమయంలో.. కొన్‌స్టాస్ భుజాన్ని కోహ్లీ తాకాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకర్ని ఒకరు తిరిగి చూసుకున్నారు. కొన్ని మాటలు అనుకున్నారు. మరో బ్యాటర్ ఖవాజా వచ్చి ఆ గొడవను కూల్ చేసే ప్రయత్నం చేశాడు.
ఇద్దరు ప్లేయర్లతో చర్చించిన ఆన్‌ఫీల్డ్ అంపైర్లు.. కోహ్లీపై లెవల్ 1 అభియోగాన్ని నమోదు చేశారు. ఆ నేరం కింద అతనికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. కోహ్లీకి ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు తొలుత కొందరు మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. లెవల్ 2 నేరం అయితే కోహ్లీ నాలుగు పాయింట్లు కోల్పోయేవాడు. దాని వల్ల అతను ఓ టెస్టు మ్యాచ్‌ను దూరం అయ్యే అవకాశాలు ఉండేవి. క్రికెట్లో ఎటువంటి భౌతికపరమైన దాడి .. ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుంది.
కోహ్లీ భుజం తాకిన ఘటనపై కొన్‌స్టాస్ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. అతనేమీ కావాలని భుజాన్ని ఢీకొట్టలేదన్నాడు. అకస్మాత్తుగా కోహ్లీ తనవైపు దూసుకొచ్చాడని, క్రికెట్లో ఇదంతా జరుగుతుందన్నాడు. ఇద్దరమూ భావోద్వేగానికి లోనైట్లు చెప్పాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కొన్‌స్టాస్ 27 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఓవర్లో అతను బుమ్రా బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

