విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ్లీ ఒక అభిమానితో గొడవపడ్డాడంటే ఏదో కారణం ఉండాల్సిందే కదా.
తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీసెస్టర్షైర్ కౌంటీ క్లబ్తో ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నెట్ బౌలర్గా టీమిండియాతోపాటు ఇంగ్లండ్ వెళ్లిన కమలేష్ నాగరకోటిని కొందరు అభిమానులు ఇబ్బంది పెట్టారు. తమతో సెల్ఫీ దిగడంలేదని గద్దించారు. ఇది చూసిన కోహ్లీ సదరు అభిమానితో గొడవ పడ్డాడు.
కోహ్లీ వచ్చి ఏంటీ గొడవ? అని అడగడంతో సమాధానం చెప్పిన ఆ అభిమాని.. తాను ఉద్యోగానికి సెలవ పెట్టి మరీ మ్యాచ్ చూసేందుకు వచ్చానని, నాగర్కోటిని సెల్ఫీ అడిగితే పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చిన తనకు సెల్ఫీ తీసుకునే హక్కుంటుందని వాదించాడు.
అతని వాదన విన్న కోహ్లీ విసుగ్గా.. ‘‘తను నీ కోసం ఇక్కడకు వచ్చాడా? కాదు కదా! తను మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు’’ అని అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్గా మారింది. యువ ఆటగాళ్లకు కోహ్లీ ఎలా అండగా నిలబడతాడో ఈ ఘటన వివరిస్తోందని అభిమానులు మెచ్చుకుంటున్నారు.
People talk about Surya Kumar yadav incident on how arrogant and egoistic Virat Kohli treat youngsters
But no one will talk about this where Kohli got angry when crowd was bullying nagarkoti in recent practice match❤️ pic.twitter.com/TdIeUSPLTA— akshat (@ReignOfVirat) June 25, 2022