Virat Kohli | టీ20ల్లో ‘వంద’ హాఫ్ సెంచరీలు.. మూడో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు
Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 50 సెంచరీలతో రికార్డు నెలకొల్పిన విరాట్ తాజాగా టీ20ల్లో వంద అర్ధ శతకాలు బాదేశాడు. దాంతో, ఈ రికార్డుకు చేరువైన తొలి టీమిండియా ఆటగాడిగా విరాట్...
Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 50 సెంచరీలతో రికార్డు నెలకొల్పిన విరాట్ తాజాగా టీ20ల్లో వంద అర్ధ శతకాలు బాదేశాడు. దాంతో, ఈ రికార్డుకు చేరువైన తొలి టీమిండియా ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో, పొట్టి ఫార్మాట్లో వంద అర్ధ శతకాల మైలురాయికి చేరుకున్నాడు.
ఇప్పటివరకూ పొట్టి క్రికెట్లో ముగ్గురు మాత్రమే 100 హాఫ్ సెంచరీలు బాదారు. వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ (Chris Gayle), ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు డేవిడ్ వార్నర్(David Warner)లు కోహ్లీ కంటే ముందున్నారు. గేల్ సాధించగా 110 ఫిఫ్టీలు బాదగా.. డేవిడ్ భాయ్ 109 హాఫ్ సెంచరీలు కొట్టాడు.
క్రిస్ గేల్, కోహ్లీ, డేవిడ్ వార్నర్

లెత్తిపోయాడు. రెండో బంతికే బెయిర్‌స్టో క్యాచ్ నేలపాలు చేయడంతో బతికిపోయిన విరాట్.. ఓ రేంజ్లో ఆడాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. హర్షల్ పటేల్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన కోహ్లీ ఆ తర్వాత బౌండరీ వద్ద హర్‌ప్రీత్ బ్రార్‌కు క్యాచ్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీపై వేటు పడనుందనే వార్తలకు తన సూపర్ ఇన్నింగ్స్‌తో కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపిస్తూ విధ్వంసక హాఫ్ సెంచరీ బాదాడు. అతడు ఔటయ్యాక దినేశ్ కార్తిక్(28 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ లొమ్రోర్(17 నాటౌట్)లు చివరిదాకా నిలబడి జట్టును గెలిపించారు. దాంతో, ఆర్సీబీ 17వ సీజన్లో బోణీ కొట్టింది.
అత్యధిక క్యాచ్‌లు
టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లతో కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగని మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన విరాట్.. 173 క్యాచ్‌లతో సురేశ్ రైనా(suresh raina) రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ 167, మనీశ్ పాండే 146, సూర్యకుమార్ యాదవ్ 136 క్యాచ్‌లు పట్టారు. పంబాజ్పై విజయం అనంతరం కోహ్లీ ఉత్సాహంగా డాన్స్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
2 baccho ka baap hai ye😭 pic.twitter.com/yv6iDaNLEs
— Chango Tarlie 🦉 (@owl_corner) March 26, 2024
ఇవి కూడా చదవండి
- Cell phone towers | సెల్‌ఫోన్ టవర్ల పరికరాలు చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్
- Nawazuddin Siddiqui | లైన్ క్లియర్.. మళ్లీ ఒక్కటైన నవాజుద్దీన్-ఆలియా దంపతులు
- Anakapalli Candidate | అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు.. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన జగన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

