Venkatesh Iyer | దోతీ కట్టి.. వేదపాఠశాల విద్యార్థులతో క్రికెట్ ఆడిన అయ్యర్.. వీడియో వైరల్
Venkatesh Iyer | ఐపీఎల్ స్టార్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer ) దోతీ కట్టులో క్రికెట్ ఆడాడు.
Venkatesh Iyer | ఐపీఎల్ స్టార్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer ) దోతీ కట్టులో క్రికెట్ ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో తన బ్యాటింగ్‌తో అయ్యర్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన అయ్యర్.. అందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్రెండర్ మెకల్లమ్ తర్వాత ఐపీఎల్లో కేకేఆర్ తరఫున శతకం సాధించిన తొలి బ్యాటర్‌గా అయ్యర్ నిలిచాడు. అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
కాగా, ఐపీఎల్ ముగియడంతో ప్రస్తుతం అయ్యర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తమిళనాడు కాంచీపురం (Kanchipuram)లోని ఓ వేద పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న పిల్లల (Veda Pathshala students )తో కలిసి సరదాగా గడిపాడు. వారితో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘క్రికెట్ పట్ల వీరికి ఉన్న ప్రేమ నమ్మశక్యం కానిది. కాంచీపురంలోని వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులతో సరదాగా ఇలా గడిపాను..’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ఆ పిల్లల కల నిజమైంది’, ‘మీపై గౌరవం 10000000000000000000 శాతం పెరిగింది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అయ్యర్ తన ఐపీఎల్ (IPL) కెరీర్లో మొత్తం 36 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 956 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో పాటు టీమిండియా తరఫున రెండు వన్డేలు, తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Also Read..
AI-generated images | ఏఐ మాయ.. దేశాధినేతలు చిన్నారులైతే ఇలా ఉంటారు..!
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద ఘటన.. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
Golden Temple | ఆపరేషన్ బ్లూ స్టార్.. గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

