Volleyball | హైదరాబాద్: హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన నగరాల్లో ‘విజయ్ దేవరకొండ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో రెండు రాష్ర్టాల్లోని మొత్తం 16 సిటీల నుంచి 307 జట్లు పోటీపడుతున్నాయని ఫ్రాంచైజీ యజమాని అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన తెలిపారు.