R Vaishali : ప్రపంచ చదరంగాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్లు శాసిస్తున్నారు. ఈమధ్యే ఫిడే మహిళల వరల్డ్ కప్ టైటిల్‌తో దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) కొత్త అధ్యాయం లిఖించగా.. తాజాగా రమేశ్‌బాబు వైశాలి(R Vaishali) సైతం చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్విస్ టైటిల్న నిలబెట్టుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది.
సోమవారం జరిగిన ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ టాన్ జొంగ్యీ (Tan Zhongyi)కు ముచ్చెమటలు పట్టించింది వైశాలి. అసమాన పోరాటంతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత చెస్ క్వీన్.. అత్యధిక పాయింట్లతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టాన్ జోంగ్యీకి చెక్ పెట్టడం ద్వారా వచ్చే ఏడాది జరుగబోయే క్యాండిడేట్స్ టోర్నీ(Candidates Tournament)కి అర్హత సాధించిందీ చెస్ క్వీన్.
🇮🇳 R Vaishali also secures her spot in the 2026 Women’s Candidates 💪
She is the third Indian to qualify for the Candidates after Divya Deshmukh & Koneru Humpy ✅ pic.twitter.com/EkV2Li36Gk
— ESPN India (@ESPNIndia) September 15, 2025
సోదరుడు ప్రజ్ఞానంద తరహాలోనే సంచలన విజయాలకు కేరాఫ్ అయిన వైశాలి గ్రాండ్ స్విస్ టోర్నీలో చెలరేగిపోయింది. వ్యూహాత్మక ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపించిన ఈ యంగ్‌స్టర్ రెండోసారి విజేతగా నిలిచింది. దాంతో.. మహిళల విభాగం నుంచి ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయిన మూడో భారతీయురాలిగా వైశాలి గుర్తింపు సాధించింది. ఆమె కంటే ముందు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ బెర్తులు సొంతం చేసుకున్నారు.