Vaibhav Sooryavanshi : బౌలర్ ఎవరైనా నా ఆట ఇంతే అన్నట్టు ఐపీఎల్లో చెలరేగిపోతున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. గువాహటిలో ముంబై ఇండియన్స్ బౌలర్లను బెంబేలెత్తించాడీ పదిహేనేళ్ల సంచలనం. 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో వైభవ్.. ముంబై వెటరన్ జస్ప్రీత్ బుమ్రాకు సిక్సర్‌తో స్వాగతం పలికాడు. తొలి బంతిని అమాంతం స్టాండ్స్‌లోకి పంపిన ఈ చిచ్చరపిడుగు.. నాలుగో బంతికి అదే దారి చూపించాడు. అంతే.. ‘ఏం కొట్టుడు రా నాయనా’ అని బుమ్రా సైతం నవ్వుకున్నాడు.
వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో యశస్వీ జైస్వాల్ పూనకాలు వచ్చినట్టే చెలరేగి 4, 6, 4, 4, 4 తో 20 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా సంధించిన తొలి బంతిని లాంగాన్ దిశగా సిక్సర్‌గా మలిచి అందర్నీ అబ్బురపరిచిన వైభవ్ సూర్యవంశీ(39 : 14 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్సర్లు).. నాలుగో బంతిని లెగ్ సైడ్ స్టాండ్స్‌లోకి పంపాడు.
The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡
🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X
— IndianPremierLeague (@IPL) April 7, 2026
ఆ తర్వాత బౌల్ట్, శార్థూల్ ఠాకూర్‌కు చుక్కలు చూపించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ భారీ షాట్‌కు యత్నించి తిలక్ వర్మకు చిక్కాడు. బౌండరీ లైన్ వద్ద తిలక్ పైకెగురుతూ క్యాచ్ పట్టగా వైభవ్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికీ రాజస్థాన్ స్కోర్.. 80-1.