Vaibhav Sooryavanshi | ఐపీఎల్లో వైభవ్ ప్రకంపనలు.. ఈసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..!
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) రికార్డుల మోత మోగిస్తున్నాడు. మొన్న16 బంతుల్లో అర్ధ శతకంతో మెరిసిన వైభవ్ ఈసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు.
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) రికార్డుల మోత మోగిస్తున్నాడు. మొన్న16 బంతుల్లో అర్ధ శతకంతో మెరిసిన వైభవ్ ఈసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. గువాహటిలో ఆర్సీబీ పేసర్లను అనామకుల మాదిరిగా ఉతికేసిన ఈ చిచ్చరపిడుగు సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి వేగవంతమైన యాభైతో తన మార్క్ విధ్వంసంతో అభిమానులను అలరించాడు. బాదుడే పరమావధిగా ఆడుతున్న ఈ కుర్ర బ్యాటర్ ఐపీఎల్లో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
జూనియర్ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్లో వరసపెట్టి ప్రపంచస్థాయి బౌలర్లను ఉతికేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓవర్లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. ఈ దఫా ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌కు చుక్కలు చూపించాడు. తొలిసారి హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొన్న ఈ బుడ్డోడు వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు పిండుకున్నాడు.
First fifty of the season in 15 balls ✅
Second fifty of the season also in 15 balls ✅✅Vaibhav Sooryavanshi does it again 🤯
Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/txT0eITbdP
— IndianPremierLeague (@IPL) April 10, 2026
ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్లో వరసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడీ పవర్ హిట్టర్. వైభవ్ ఊచకోతతో ఆర్సీబీ నిర్ధేశించిన 202 పరుగుల ఛేదనలో రాజస్థాన్ స్కోర్ బోర్డు రాకెట్లా పరుగులు పెడుతోంది. ధ్రువ్ జురెల్ సైతం బ్యాట్ ఝులిపించడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది రాజస్థాన్. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్‌ను ఆపడం ఎలా? అని ఆర్సీబీ బౌలర్లు తలలు పట్టుకున్నారు.
Dismissing vaibhav sooryavanshi ain’t easy as Bhuvneshwar made it look like pic.twitter.com/Wuqs9RPmXY
— ‘ (@defendkohly18) April 7, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

