న్యూయార్క్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్..యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తన వరుస విజయాల జోరు కొనసాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ అల్కారజ్ 6-3, 6-1, 7-6(7/4) తేడాతో లాయిడ్ హారిస్(దక్షిణాఫ్రికా)పై అద్భుత విజయం సాధించాడు.
మ్యాచ్‌లో ఆది నుంచి దూకుడు కనబరిచిన అల్కారజ్..బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ మొత్తమ్మీద అల్కారజ్ నాలుగు ఏస్‌లు సంధించగా, ఐదు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. ఆరుసార్లు అనవసర తప్పిదాలకు పాల్పడిన లాయిడ్ మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు భారత ప్లేయర్లు యుకీ భాంబ్రీ, సాకేత్ మైనేని తొలి రౌండ్లలోనే తమ పోరాటాన్ని ముగించారు.