DC vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్‌లో యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ ఫీల్డింగ్ తీసుకుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేశాయి. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీని యూపీ నిలువరిస్తుందా? లేదా? అనేది చూడాలి. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ గెలుపొందింది. కిరణ్ నవ్గరే, గ్రేస్ హ్యారిస్ హాఫ్ సెంచరీ బాదడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 60 రన్స్ తేడాతో ఓడించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, మేగ్ లానింగ్ అర్ధ శతకాలతో చెలరేగారు. వీళ్లు తొలి వికెట్‌కు 163 రన్స్ జోడించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్.
యూపీ వారియర్స్ జట్టు : అలిసా హేలీ(వికెట్ కీపర్), శ్వేతా షెరావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తీ శర్మ, సిమ్రాన్ షస్త్రక్, దేవికా వైద్యా, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిం ఇస్మాయిల్, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్.