మొలినూ జాక్‌పాట్.. రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్ కప్‌ను అందించిన సోఫీ మొలినూ జాక్‌పాట్ కొట్టింది. బుధవారం జరిగిన వేలంలో ఆమెను యూపీ వారియర్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది.
- నవ్‌గిరెకు రూ. 75 లక్షలు
కొచ్చి : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్ కప్‌ను అందించిన సోఫీ మొలినూ జాక్‌పాట్ కొట్టింది. బుధవారం జరిగిన వేలంలో ఆమెను యూపీ వారియర్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మొలినూను జట్టుకు సారథిగా నియమించేందుకే ఆమెపై భారీ ధర వెచ్చించినట్టు తెలుస్తున్నది. వారియర్స్ ఆమెతో పాటు ఆసీస్ ఆల్‌రౌండర్ గ్రేస్ హారీస్ (రూ. 30 లక్షలు), భారత క్రికెటర్లు స్నేహ్ రాణా (రూ. 30 లక్షలు), ఆశా శోభన (రూ. 30 లక్షలు)ను తీసుకుంది.
ఇక గత మూడు సీజన్లలో యూపీకి ఆడిన హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరెను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది. భారత యువ బ్యాటర్ కమిలినిని గుజరాత్ జెయింట్స్ రూ. 40 లక్షలకు తీసుకుంది. లేట్‌గా వేలం ప్రక్రియను ప్రారంభించిన ఆర్సీబీ.. కంగారూ ఆల్‌రౌండర్ జెస్ జొనాసెన్‌ను రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది. 27 స్లాట్స్ కోసం జరిగిన వేలంలో 25 పూర్తవగా ఆర్సీబీ, ఢిల్లీ వద్ద తలా ఒక స్లాట్ ఖాళీ ఉంది. వేలంలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచిన కర్ణాటక ఆల్‌రౌండర్ ఉమా కశ్విని రూ. 10 లక్షలకు ఢిల్లీ దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

