బ్యూనస్ఎయిర్స్ : అండర్-20 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో అమెరికా జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో అమెరికా 4-0తో విజయం సాధించింది. ఆరంభంలో ఓవెన్ ఉల్ఫ్ గోల్ తరువాత 61వ నిమిషం వరకు అమెరికా మరో గోల్ సాధించలేకపోయింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో కేడ్ కోవెల్, జస్టిన్ చె, రోకాస్ పక్స్టాస్ మూడు గోల్స్ సాధించారు.
అమెరికా ఇప్పటివరకు ప్రత్యర్థులకు గోల్ సమర్పించుకోకపోవడం గమనార్హం. తదుపరి మ్యాచ్‌లో అమెరికా గాంబియా లేదా ఉరుగ్వేతో తలపడుతుంది.