Union Budget | ఆటలకు అరకొర నిధులే.. గతేడాదితో పోల్చితే పెరిగింది రూ. 45 కోట్లే
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు ఈ బడ్జెట్లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గతేడాది (రూ. 3,396.80 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్లో పెరిగింది రూ. 45.36 కోట్లు మాత్రమే.
Union Budget | ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు ఈ బడ్జెట్లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గతేడాది (రూ. 3,396.80 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్లో పెరిగింది రూ. 45.36 కోట్లు మాత్రమే. ఇక గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికితీసేందుకు మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి రూ. 900 కోట్లను కేటాయించారు.
గత ఆర్థిక సంవత్సరం కంటే అదనంగా ఇచ్చింది రూ. 20 కోట్లే. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)కు రూ. 340 కోట్లు, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ‘టాప్స్’కు రూ. 822.60 కోట్లు, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి రూ. 22.30 కోట్లు, నేషనల్ డోప్ టెస్టింగ్ లేబోరేటరీ (ఎన్‌డీటీఎల్)కు రూ. 22 కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

