ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం పలు రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ విషయంలో చాలా దేశాలు రష్యా పద్ధతిని తప్పుబట్టాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా వన్ సంస్థ.. తమ రేసును రష్యాలో నిర్వహించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఫార్మాలా వన్ నుంచి శుక్రవారం నాడు ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్‌పై మిలటరీ చర్యలకు రష్యా ఆదేశించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాలో ఎఫ్1 రేసు నిర్వహించడం అసాధ్యమని ఈ రేస్ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 25న రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ జరగాల్సి ఉంది. ఈ రేస్‌కు సోచి వేదిక కానుంది. అయితే ప్రస్తుత యుద్ధం కారణంగా ఈ నిర్ణయాన్ని ఫార్ములా వన్ మార్చుకుంది. రష్యాల రేస్ నిర్వహించకూడదని నిర్ణయించింది.
‘‘దేశాలను, ప్రజలను ఏకం చేయాలనే సద్భావంతో వివిధ దేశాల్లో ఎఫ్ఐఏ ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తూ వచ్చాం. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పరిస్థితిని బాధ, షాక్‌తో చూస్తుండిపోయాం. ఈ సమస్య త్వరగా తీరి ఇక్కడ శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం ఫార్ములా 1, ఎఫ్ఐఏ, జట్లు అన్నింటి ప్రతినిధులు సమావేశమయ్యారు. మా క్రీడ ఏ స్టాండ్‌లో ఉండాలనే విషయమై చర్చించాం. భాగస్వాములందరి అభిప్రాయాల ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వహించలేమనే నిర్ణయానికి వచ్చాం’’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
A statement on the Russian Grand Prix pic.twitter.com/OZbbu9Z8ip
— Formula 1 (@F1) February 25, 2022