IPL 2024 | వేలంలో కోట్లు కొల్లగొట్టి.. ఫ్రాంచైజీలను నట్టేట ముంచింది వీళ్లే
IPL 2024 : పదహారేండ్లుగా క్రికెట్ అభిమానులు ఎంతగానో అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మరో సీజన్‌కు సిద్ధమవుతోంది. 17వ సీజన్ వేలానికి టైమ్ దగ్గరపడడంతో ఫ్రాంచైజీలు అంచనాలు అందుకున్న ఆటగాళ్లను అట్టిపెట్టుకొన్నాయి. మెగా టోర్నీలో ఘోరంగా విఫలమైనవాళ్లను వదిలించుకున్నాయి. నిరుడు మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టిన,,,
IPL 2024 : పదహారేండ్లుగా క్రికెట్ అభిమానులు ఎంతగానో అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మరో సీజన్‌కు సిద్ధమవుతోంది. 17వ సీజన్ వేలానికి టైమ్ దగ్గరపడడంతో ఫ్రాంచైజీలు అంచనాలు అందుకున్న ఆటగాళ్లను అట్టిపెట్టుకొన్నాయి. మెగా టోర్నీలో ఘోరంగా విఫలమైనవాళ్లను వదిలించుకున్నాయి. నిరుడు మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లను సైతం పది జట్లు మొహమాటం లేకుండా విడుదల చేశాయి.
అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టిన స్టార్ ప్లేయర్లు 16వ సీజన్లో తమ చెత్త ఆటతో ఫ్రాంచైజీలను నట్టేట ముంచారు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్(చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్(సన్ రైజర్స్ హైదరాబాద్), శార్దూల్ ఠాకూర్(కోల్‌కతా నైట్ రైడర్స్), వనిందు హసరంగ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), హర్షల్ పటేల్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) వంటి వాళ్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ హీరో సామ్ కరన్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.50 కోట్లు పెట్టింది. కానీ, అతడు మాత్రం 14 మ్యాచుల్లో 276 పరుగులు చేసి, 10 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు.
బెన్ స్టోక్స్

నిరుడు మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes)ను చెన్నై 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. 2019లో ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా నిలిపిన అతడిపై చెన్నై యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, స్టోక్స్ గాయంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆడని రెండు మ్యాచుల్లో నిరాశపరిచాడు.
శార్ధూల్ ఠాకూర్

నిరుడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శార్ధూల్ ఠాకూర్ (Shardhul Thakur)ను రూ.10.75 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది. అయితే.. ఈ ఆల్‌రౌండర్ బ్యాటుతో, బంతితో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 7 వికెట్లు తీసి.. బ్యాటుతో 113 పరుగులు చేశాడంతే. పైగా ‘ఇంపాక్ట్ ప్లేయర్'(Imapact Player) రూల్‌తో స్పెషలిస్ట్ బౌలర్ లేదా బ్యాటర్‌ను తీసుకునే చాన్స్ ఉంది. దాంతో, కోల్‌కతా మినీ వేలంలో శార్దూల్ స్థానంలో ప్రతిభావంతుడైన ప్లేయర్‌ను తీసుకోవాలని కోల్‌కతా భావిస్తోంది.
పాకిస్థాన్ టూర్లో దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(Harry Brook)ను సన్ రైజర్స్ హైదరాబాద్‌ను రూ.13.25 కోట్లకు కొన్నది. ఈ స్టార్ బ్యాటర్ సెంచరీతో ఆశలు రేపినా.. ఆ తర్వాత వరుసగా విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఓపెనర్, మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఆశించిన ఫ్రాంచైజీని నట్టేట ముంచాడు. బ్రూక్ 11 మ్యాచుల్లో కేవలం 190 పరుగులు చేశాడంతే.
హ్యారీ బ్రూక్

ఆర్సీబీ స్టార్ పేసర్‌గా వెలుగొందుతున్న హర్షల్ పటేల్(Harshal Patel) 16వ సీజన్లో విఫలమయ్యాడు. ఫ్రాంచైజీ అతడిపై వెచ్చించిన రూ.10.75 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ దంచికొట్టినా.. బౌలింగ్ యూనిట్ దారుణంగా విఫలమైంది. బౌలింగ్ దళానికి నేతృత్వం వహించిన పటేల్ 13 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు.
హర్షల్ పటేల్

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ హసరంగ(Wanindu Hasaranga) కోసం మినీ వేలంలో ఆర్సీబీ రూ.10.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే.. ఈ స్టార్ స్పిన్నర్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈమధ్యే స్వదేశంలో ముగిసన లంక ప్రీమియర్ లీగ్‌లో మరోసారి గాయంతో వరల్డ్ కప్ ఆడలేదు. అతడు కోలుకునేందుకు ఇంకొంచెం టైమ్ పట్టనుంది. దాంతో, 2024 సీజన్‌కు ఆర్సీబీ అతడిని వదులుకోవాలని డిసైడ్ అయింది.
ఇవి కూడా చదవండి
-
Team India | టీ20ల్లో టీమిండియా జోరు.. 135 విజయాలతో పాకిస్థాన్ రికార్డు సమం
-
Lightning Strikes | అకాల వర్షంతో గుజరాత్ అతలాకుతలం.. పిడుగుపాటుకు 20 మంది మృతి
-
Animal Movie | ‘యానిమాల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్లుగా రాజమౌళి, మహేశ్.!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

