టోక్యో: ఒలింపిక్స్ అనగానే గుర్తొచ్చేది ఐదు రింగులు. ఒకదానికొకటి కలిసి ఉండే ఈ రింగులు భూమిపై ఉన్న ఐదు ఖండాల ఐక్యమత్యానికి ప్రతీక. అయితే ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో కనిపించే ఐదు రింగులకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఐదు రింగులను చెక్కతో తయారు చేశారు. అయితే ఈ చెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 1964లో జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆ దేశ అథ్లెట్లు నాటిన చెట్ల నుంచే కావడం విశేషం. ఆ ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన తొలి ఆసియా దేశంగా జపాన్ రికార్డు సృష్టించింది. ఆ గేమ్స్ తర్వాత జపాన్ అథ్లెట్లు కొన్ని మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై.. ఇప్పుడు ఒలింపిక్స్ ఐదు రింగులను తయారు చేయడానికి అవసరమైన కలపను అందించాయి.
An #olympics fact for you…
— Nick Hope – the athlete’s journalist 👨💻🏊🏻♂️ (@NickHopeTV) July 23, 2021
The wood used to carve the Olympic Rings in the #Tokyo2020 opening ceremony tonight are made from the trees which were planted by 🇯🇵’s athletes at the 1964 Games – the last time Japan hosted the Olympics #bbcolympics pic.twitter.com/gNPraNIzGX