మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 01, 2020 , 01:28:09

రసవత్తరంగా టీవోఏ ఎన్నికలు

 రసవత్తరంగా టీవోఏ ఎన్నికలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌(టీవోఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి పోటీపడుతున్నారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి పదవికి ఏ జగన్‌మోహన్‌ రావు, జగదీశ్వర్‌ యాదవ్‌ పోటీలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లపై ఇరు వర్గాలు తమ అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జస్టిస్‌ బీ చంద్రకుమార్‌కు సమర్పించారు. స్క్రూటిని తర్వాత తుది జాబితాను శనివారం విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. గడువు ముగిసే సరికి 56 నామినేషన్లు వచ్చాయని చెప్పిన ఉప రిటర్నింగ్‌ అధికారి..ఆ సంఖ్యను పెంచినట్లు పేర్కొనడం సరికాదని రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు విమర్శించారు. నామినేషన్‌ పత్రాలు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో గాకుండా వేరో చోట ఉంచడాన్ని ఆయన తప్పుబడుతూ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని  పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ వేదికగా టీవోఏ ఎన్నికలు జరుపాలంటూ హైకోర్టును జయేష్‌ రంజన్‌ ప్యానెల్‌ ఆశ్రయించగా, తీర్పు  సోమవారానికి వాయిదా పడింది. 


logo
>>>>>>