MI vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు వరసగా ఐదో ఓటమి ఎదురైంది. ధర్మశాలలో తిలక్ వర్మ(75 నాటౌట్) శివమెత్తగా.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. 201 ఛేదనలో శుభారంభం దక్కినా.. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడడంతో పంజాబ్ పోటీలోకి వచ్చింది. కానీ, తిలక్ పట్టువదలకుండా ఆఖరిదాకి నిలబడ్డాడు.. చివరి ఓవర్లో 6, 4 తో ముబైకి ఆరు వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు. ఇక కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే బుమ్రా జట్టును గెలిపించాడు.
లీగ్ దశలో ఎనిమిది ఓటములతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్ ఇతర జట్లను దెబ్బతీస్తోంది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌పై ముంబై అదిరే విక్టరీ కొట్టింది. భారీ ఛేదనలో పంజాబ్ బౌలర్లను ఉతికేస్తూ తిలక్ వర్మ(75 నాటౌట్) ఒంటిచేత్తో ముంబైకి నాలుగో విజయం అందించాడు. దాంతో..ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ముందుకు వెళ్లాలనుకున్న పంజాబ్ 13 పాయింట్ల వద్దే ఆగిపోయింది.
106 METRE SIX! 🤯
🎥 Tilak Varma levels the longest six of the season with this hit 😮👏
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI | @mipaltan pic.twitter.com/lstHCjGAkq
— IndianPremierLeague (@IPL) May 14, 2026
ఆఖరి ఓవర్లలో పట్టుసడలించి పంజాబ్‌ను రెండొందలు కొట్టేందుకు అవకాశమిచ్చిన ముంబై ఛేదనలో ఓపెనర్లు రియాన్ రికెల్టన్(48), ఇంప్యాక్ట్ సబ్ రోహిత్ శర్మ(25)లు శుభారంభమిచ్చారు. రికెల్టన్ బౌండరీల మోతతో స్కోర్ బోర్డును ఉరికించాడు. విజయాన్ని లాగేసుకుంటున్న ఈ జోడీని అజతుల్ల(౦) విడదీశాడు. కాసేపటికే నమన్ ధిర్(9) బిగ్ షాట్ ఆడబోయి అర్ష్‌దీప్ చేతికి చిక్కగా.. చాహల్ ఓవర్లో హిట్‌మ్యాన్ బౌల్డయ్యాడు. తిలక్ వర్మ(75 నాటౌట్), రూథర్‌ఫొర్డ్(20)లు గెలుపు బాధ్యత తీసుకొని భాగస్వామ్యం నిర్మించారు.
Tilak Varma and Will Jacks racing #MI to the finish line 🏎️
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI pic.twitter.com/QznK4Mdkwy
— IndianPremierLeague (@IPL) May 14, 2026
పంజాబ్ బౌలర్లను కాచుకొని నాలుగో వికెట్‌కు 61 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని అజ్మతుల్ల విడగొట్టాడు. కానీ, తిలక్ తగ్గలేదు. యాన్సెన్ ఓవర్లో లెగ్ సైడ్ సిక్సర్‌తో యాభై పూర్తి చేసుకున్నాడు. యాన్సెన్ ఓవర్లో జాక్స్(25 నాటౌట్) తిలక్ 22.. ఆపై అర్ష్‌దీప్ బౌలింగ్‌లో 19 రన్స్ పిండుకున్నారు. బార్ట్లెట్ వేసిన చివరి ఓవర్లో 15 రన్స్ అవసరమవ్వగా.. తొలి బంతినే జాక్స్ స్టాండ్స్‌లోకి పంపాడు. తర్వాత సింగిల్.. నాలుగో బంతికి తిలక్ సిక్సర్ బాదాడు. ఐదో బంతికి బౌండరీ రాగా ముంబై ఆరు వికెట్లతో పంజాబ్‌ను మట్టికరిపించింది.
Standing tall while the heat is on. 🛡️
A clutch half-century from Tilak Varma 👏
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI pic.twitter.com/eQdjky7b22
— IndianPremierLeague (@IPL) May 14, 2026
ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్ తడబడినా చివరకు భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(57) అర్ధ శతకంతో చెలరేగినా.. శార్దూల్ ఠాకూర్(4-39) సూపర్ స్పెల్‌తో మిడిలార్డర్ కుప్పకూల్చాడు. దీపక్ చాహర్(2-36) సైతం బెంబేలెత్తించగా పంజాబ్ స్కోర్ 150 దాటితే గొప్ప అనిపించింది. కానీ, అజ్మతుల్లా ఒమర్జాయ్(38), ఇంప్యాక్ట్ సబ్ విష్ణు వినోద్(15 నాటౌట్), బార్ట్లెట్(18 నాటౌట్)లు డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడగా అయ్యర్ సేన ముంబై ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.