IPL | ముంబై : ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్ల టికెట్ల విక్రయం శనివారం నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. జొమాటోకు చెందిన డిస్ట్రిక్ యాప్ ద్వారా టికెట్లు అందుబాటులోకి ఉంటాయని తెలిపింది.
రూపే కార్డు దారులకు 24 గంటల ప్రత్యేక విండో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈనెల 27తో లీగ్ దశ ముగిసి 29వ తేదీ నుంచి ప్లేఆఫ్స్ మొదలుకానున్నాయి.