Mohammad Hafeez : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్‌లోని హఫీజ్ ఇంట్లోకి మార్చి 5 ఆదివారం రాత్రి దొంగలు చొరబడ్డారు. రూ.25 వేల డాలర్ల (పాకిస్థాన్ రూపాయిలో 25 డాలర్ల విలువ దాదాపు రూ.2 కోట్లు)లతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.
దొంగతనం జరిగే సమయంలో సమయంలో హఫీజ్, అతని భార్య ఇంట్లో లేరు. ఈ ఆల్‌రౌండర్ ఇంట్లో దొంగలు చొరబడి భారీగా విదేశీ కరెన్సీ, విలువైన సొత్తు ఎత్తుకెళ్లారని గురించి వాళ్ల అంకుల్ షాహిద్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఆల్‌రౌండర్‌గా విశేష సేవలందించిన హఫీజ్ 2022 జనవరి 3న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు 18 ఏళ్లు ఆల్‌రౌండర్‌గా జట్టుకు డు. టాప్ ఆర్డర్ నుంచి ఆరో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా అతని సొంతం. పాకిస్థాన్ తరఫున 392 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ ప్లేయర్ మూడు ఫార్మాట్లలో 12,780 రన్స్ చేశాడు. 253 వికెట్లు తీశాడు. 2018లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత వన్డేలు, టీ20ల్లో కొనసాగాడు. హఫీజ్ 2019 వరల్డ్ కప్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం హఫీజ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.