న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ మండలి బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. మండలిలో 40 శాతం మహిళలకు సభ్యత్వం కల్పించడమేగాక, లింగ సమానతను పాటిస్తూ ఈ యేడాది ఉపాధ్యక్ష పదవిని మహిళకు కట్టబెట్టాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే ఉక్రెయిన్ అథ్లెట్లకు ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్యుక్తమయింది. ఉక్రెయిన్ అథ్లెట్లలో చాలావరకు మహిళలే ఉండడం గమనార్హం. అలాగే మహిళా కోచ్ల సంఖ్యకూడా పెరిగేందుకు సహాయం చేయ నిశ్చయించింది.