చెన్నై: ఐపీఎల్ 17వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేచే సమయం ఆసన్నమైంది. శుక్రవారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా తారల తళుకు బెళుకుల మధ్య లీగ్ ప్రారంభం కాబోతున్నది. సాయం త్రం 6.30 గంటలకు మొదలయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను అలరించనున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌లతో జోష్ తేనున్నారు. తాము కలిసి నటించిన బడే మియా..చోటే మియా సినిమాను ప్రమోషన్ చేయనున్నారు. వీరికి తోడు ప్రముఖ సింగర్ సోను నిగమ్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాటలతో స్టేడియం హోరెత్తనుంది.