హైదరాబాద్, ఆట ప్రతినిధి: చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వేదికగా ఎల్వీఆర్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన వివిధ మ్యాచ్‌ల్లో ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వైఎమ్‌సీఏ హైదరాబాద్ 44-7తో వీపీజీపై ఘన విజయం సాధించింది. ఆది నుంచే తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన వైఎమ్‌సీఏ హైదరాబాద్ వరుస పాయింట్లతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
వైఎమ్‌సీఏ సికింద్రాబాద్ 51-18తో జింఖానా గ్రౌండ్స్‌పై గెలిచింది. మిగతా మ్యాచ్‌ల్లో కీస్టోన్ 67-47తో వైఎమ్‌సీఏ హైదరాబాద్‌ను ఓడించింది. కీస్టోన్ తరఫున సుభాశ్ (19), ఆర్యన్ (17) ఆకట్టుకున్నారు. రైజింగ్ స్టార్స్ 57-35తో వీపీజీపై భారీ విజయం సాధించింది. లోకేశ్ (17), నిపుణ్ (13) రైజింగ్ గెలుపులో కీలకమయ్యారు.