న్యూఢిల్లీ : భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. ప్రొ లీగ్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ చాంపియన్ జర్మనీ, ఆస్ట్రేలియా జట్లపై వరుస విజయాలతో భారత హాకీ జట్టు తన ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నది.
కాగా ఆస్ట్రేలియా ఒక స్థానం దిగజారి అయిదో ర్యాంక్‌కు చేరుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో నెదర్లాండ్స్, బెల్జియం తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.