ఇక ఆసియా పారా గేమ్స్ సందడి.. నేటి నుంచి జపాన్లో మెగా క్రీడలు
ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ ను విజయవంతంగా నిర్వహించిన జపాన్ మరో మెగా ఈవెంట్ కు సిద్ధమైంది. నగోయా వేదికగా ఆసియా పారా గేమ్స్ ఆదివారం అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
- భారత్ నుంచి 168 మంది అథ్లెట్ల పోటీ
నగోయా (జపాన్): ఇప్పటికే పలు ఈవెంట్లు మొదలైన ఈ గేమ్స్ లో భారత్ నుంచి 168 మంది అథ్లెట్లు 11 విభాగాల్లో పోటీపడుతున్నారు. హాంగ్జౌలో జరిగిన గత ఎడిషన్లో 29 స్వర్ణాలు సహా మొత్తం 111 పతకాలతో ఐదో స్థానంలో నిలిచిన భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది.
నాడు 303 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగగా.. ఈసారి దాదాపు సగం మంది మాత్రమే పోటీ పడుతున్నారు. పైగా కొన్ని ఆటల్లో సెలక్షన్ వివాదాలు తలెత్తాయి. అయినప్పటికీ మరోసారి పతకాల శతకంతో టాప్-5లో నిలవాలని భారత్ ఆశిస్తోంది. పారా అథ్లెటిక్స్లో తెలంగాణ యువ స్ప్రింటర్ జీవాంజి దీప్తితో పాటు జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, హైజంపర్ నిషాద్ కుమార్, స్ప్రింటర్ ప్రీతి పాల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.
ఆర్చరీ, బ్యాడ్మింటన్, షూటింగ్పై భారీ ఆశలు
రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో సంచలనాలు సృష్టిస్తున్న యువ ఆర్చర్ శీతల్ దేవిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. హాంగ్జౌ క్రీడల్లో రెండు స్వర్ణా లు గెలిచిన 19 ఏండ్ల శీతల్ ఆ తర్వాత ప్రపంచ టైటిల్ కూడా సాధించింది. ఆమెతో పాటు పారాలింపిక్ రికర్వ్ చాంపియన్ హర్విందర్ సింగ్, తోమన్ కుమార్ భారత్కు పతకాలు తెచ్చిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గత ఎడిషన్లో 21 పతకాలు అందించిన బ్యాడ్మింటన్లో పారాలింపిక్ చాంపియన్లు ప్రమోద్ భగత్, నితీష్ కుమార్, సుహాస్ జట్టును ముందుండి నడిపించనున్నారు. కాగా, పారా బ్యాడ్మింటన్ లో మానసి జోషి-తులసిమతి సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్నారు. మహిళల డబుల్స్ (ఎస్ఎల్ 3-ఎస్ యూ5) గ్రూప్ మ్యాచ్లో మానసి – తులసి ద్వయం 21-10, 21-17తో చైనా జంట యుమేయ్ ల్యూ – టోంగ్టోంగ్ లీపై ఘన విజయం సాధించి సెమీస్ చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

