Dheeraj | బాగ్దాద్: తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆసియా ఆర్చరీ కప్‌లో స్వర్ణంతో మెరిశాడు. పురుషుల టీమ్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన ధీరజ్.. ఆదివారం జరిగిన వ్యక్తిగత రికర్వ్ విభాగంలో 7-3తో భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్‌పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో దీపిక కుమారి రెండు స్వర్ణాలు గెలిచింది. దీంతో మొదటి అంచె పోటీల్లో భారత ఆర్చర్లు మొత్తం 14 పతకాలు ఖాతాలో వేసుకున్నారు.