హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ యంగ్ అథ్లెట్ జీవాంజి దీప్తి దేశ ఉత్తమ పారా అథ్లెట్‌గా నిలిచింది. బెంగళూరులో పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) నిర్వహించిన పారా స్పోర్ట్స్ పురస్కారాల వేడుకలో బెస్ట్ పారా అథ్లెట్ అవార్డును అందుకుంది.