హైదరాబాద్, ఆట ప్రతినిధి : సింగపూర్ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో పోటీపడే భారత జట్టుకు హైదరాబాద్‌కు చెందిన కొమరవెల్లి లాహిరి, దండు వినోద్, మహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యారు. ఈనెల 14 నుంచి సింగపూర్‌లోని నేషనల్ సెయిలింగ్ సెంటర్లో జరిగే ఈ టోర్నీలో 25 దేశాల నుంచి 200 మంది పోటీపడుతున్నారు. అండర్-15 ఆప్టిమిస్టిక్ క్లాస్ బోట్స్ విభాగంలో లాహిరి, రిజ్వాన్ బరిలోకి దిగుతున్నారు. వీరికి తో శ్రేయా కృష్ణ, సమృద్ధి బాథమ్..భారత జట్టుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌కే చెందిన సుహేమ్ షేక్, టీమ్ మేనేజర్‌గా ధరణి లావేటి వ్యవహరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సెయిలర్లు..కొంపల్లిలోని సుచిత్రా అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. యాచ్ క్లబ్లో నాణ్యమైన డైట్, యోగా సాధనతో మెరుగైన ఫిట్నెస్ సాధించామని లాహిరి, రిజ్వాన్ పేర్కొన్నారు.